సమంత బ్యాగ్ ఖరీదెంతో ఎంతో తెలిస్తే షాక్

ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు టాక్ షోలతో బిజీబిజీగా గడుపుతోంది అక్కినేని కోడలు సమంత. ఆహా యాప్‌లో ఆమె నిర్వహించిన స్యామ్ జామ్ షో సీజన్ 1 ముగిసింది. త్వరలో సీజన్ 2తో సమంత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. స్యామ్ జామ్ షో ముగియడంతో.. ప్రస్తుతం వెకేషన్లకు ప్లాన్ చేసింది. తాజాగా వెకేషన్‌కు వెళుతూ ఎయిర్‌పోర్ట్‌లో సమంత కనిపించింది.

SAMANTHA HANDBAG RATE

దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇందులో సమంత లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఈ ఫొటోలలో ప్రముఖ బ్రాండ్ వియామ్ డ్రెస్‌ని సమంత ధరించింది. మాస్క్ ధరించి సమంత కనిపించగా.. మాస్క్, డ్రెస్ కలర్ ఒకటే కావడం విశేషం. బెలూన్ స్లీవ్స్‌తో కూడిన రెడ్ కలర్ మిక్స్‌డ్ టాప్ కింద కాళ్ల వరకు ఉంది. ఈ డ్రెస్ ఖరీదు రూ.10 వేలకు పైగా ఉంటుంది. ఇక ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ ఖరీదు రూ.2 లక్షల 20 వేలు ఉంటుంది.