Tollywood: మ‌హేశ్‌కు తండ్రిగా అల్లుఅర్జున్ తండ్రి..

Tollywood: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట నుంచి స‌రికొత్త అప్‌డేట్ చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రానికి గీతాగోవిందం ఫేం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. ఇందులో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కాగా ఇందులో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అల వైకుంఠ‌పురం చిత్రంలో అల్లుఅర్జున్ ఫాద‌ర్‌గా చేసిన మ‌ల‌యాళ ప్ర‌ముఖ న‌టుడు జ‌య‌రామ్‌..

Sarkar vaari pata

స‌ర్కార్ వారి పాట చిత్రంలో మ‌హేశ్ తండ్రిగా చేయ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో బ్యాంక్ మేనేజ‌ర్‌గా క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. ఇక ఆయ‌న తెలుగులో న‌టిస్తున్న చిత్రాలు ప్ర‌భాస్ రాధేశ్యామ్‌లో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ , క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న హరిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.