పూర్వం కొందరు మహిళలు కళల మీద తమకు ఆసక్తి ఉండడంతో దేవాలయాల్లో అలాగే రాజులకు నాట్యం చేసేవారు. అయితే కొందరు పెద్దలు లేదా రాజులు వారిపైన కన్నేసి వాడు కామవంచను తీసుకోవడానికి వీరిని ఉపయోగించుకునేవారు. అలా వారి కామ వాంఛను తిరిగిన తర్వాత దేవదాసి, జోగిని, మాతంగి అనే పేర్లు మీద వీరిని ఊరికి అప్పగించేవారు. అలా ఊరికి అప్పగించిన జోగిని అమ్మాయి అలాగే గంగిరెద్దుల అబ్బాయి మధ్య జరిగిన ప్రేమ కథ ఈ చిత్రం శరపంజరం. జీరో బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మామిడి హరికృష్ణ గారి ఆశీస్సులతో గణపతి రెడ్డి గారి సహకారంతో నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో ఏప్రిల్ 19న తెరకెక్కింది. దోస్తాన్ ఫిలిమ్స్, అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ ఈ రివ్యూ ఎలా ఉందో చూద్దాం!
కథ :
శివుడు గంగిరెద్దుల కుటుంబ నేపథ్యం నుండి వస్తాడు. ఆ యువకుడు చిన్నతనం నుండి గంగిరెద్దుల వెనుక తిరుగుతూ తన స్వగ్రామం నుండి వెళ్ళిపోతాడు. అయితే ఆ మాతంగి కి పుట్టిన కూతురే మంజు. మంజు ని చిన్నతనం నుండి నీ తండ్రి ఎవరు అని అడుగుతూ అందరూ వేధిస్తూ ఉంటారు. ఇదే ప్రశ్న మంజు తన తల్లి అయిన మాతంగి అడగగా దేవుడే తన తండ్రి అని చెప్తుంది. అప్పటినుండి మంజు దేవుడనే తన తండ్రిగా పిలుస్తూ ఉంటుంది అయితే తన బిడ్డ జీవితం తన కాకూడదని మాతంగి మంజుని చాలా బాగా చూసుకుంటుంది.
అయితే 12 సంవత్సరాల తర్వాత వచ్చిన శివుడు తొలిచూపులోనే మంజు ని చూసి ప్రేమలో పడతాడు. అయితే తన ప్రేమని కొద్ది రోజుల తర్వాత అంగీకరిస్తుంది. వారిద్దరూ ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కాని ఎలాగైనా మంజును ఎలాగైనా అనుభవించాలి అనుకుంటాడు. కానీ ఆ ఊరు ప్రజలంతా తనకు వ్యతిరేకంగా ఉండటంతో మంజు ను చివరికి ఏం చేశాడు? ఆ ఊరి పెద్దలు లను ఎదిరించిన మంజు, శివుడు పెళ్లి చేసుకున్నారా లేదా? ఆ తర్వాత ఏం జరిగింది అనేది శరపంజరం సినిమా కథ.
నటీ నటులు :
కథానాయకి మంజు పాత్రలో నటించిన లయ పల్లేటూరి అమ్మాయిలా తన అందం అభినయంతో అద్భుతంగా నటించి మెప్పించింది. హీరో పాత్రలో శివుడి గా నటించిన నవీన్ కుమార్ గట్టు పెద్ద హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా చాలా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. తను చేసిన గంగిరెద్దుల ఆటతో గొప్ప సాహసమే చేసాడు తన గంగిరెద్దుల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దొర పాత్రలో నటించిన వరంగల్ భాష తన క్రూరత్వం అంటే ఎలా ఉంటుందనే మరో కోణాన్ని ఈ సినిమాలో చూపించాడు. గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ అతిధి పాత్రలో తళుక్కున మెరిసి తన నటనతో విస్మయానికి గురి చేస్తారు.ఇంకా ఈ సినిమాలో జబర్దస్త్ కళాకారులు జీవన్, రాజమౌళి, వెంకీ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. అలువాల సోమన్న, మేరుగు మల్లేశం, మానుకోట ప్రసాద్, ఆనందభారతి, ఉదయశ్రీ ఇలా ఈ సినిమాలో నటించిన వారందరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.
సాంకేతికత విషయానికి వస్తే :
చిత్ర దర్శకుడు నవీన్ కుమార్ గట్టు జోగిని వ్యవస్థ పై, మరియు గంగిరెద్దుల వారి జీవన విధానం తెలుపుతూ .తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తు చేస్తూనే 1990 ప్రాంతంలో తెలంగాణలో ఉండే పెత్తందారీ వ్యవస్థ ఆగడాలను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.ఈ సినిమా చూస్తున్నంత సేపు మనం ఒక సినిమా థియేటర్లో ఉన్నామన్న భావన కలగదు. తెలంగాణలోని ఒక పల్లెలో సంచరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాను మల్లిక్ ఎం.వి.కె. సంగీతం నిలబెట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశారు. పాటల విషయానికి వస్తే, ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుండటం విశేషం. ప్రతి పాట సన్నివేశానికి తగినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా పేర్లు పడేటప్పుడు ‘కాటిలో పేర్చిన కట్టే నీతొ రాదు’, ‘నీలాల నీ కళ్ళు’, ‘సోయిసొప్ప లేకుండా’ అనే పాటలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులను తన్మయత్వానికి లోనవుతారు. మస్తాన్ సిరిపాటి ఈ సినిమాకు ఛాయాగ్రహం అందించారు. ఈ సినిమాలో 4:45 సెకండ్ల సింగిల్ టేక్ సీన్ జోగిని తాలుకు జీవితాన్ని ప్రతిబింబించే లాగా ఉంటుంది. ప్రతి సీన్ అందంగా ఉంటుంది. తొలి చిత్రంతోనే ప్రతిభావంత మైన కెమెరామెన్ అనిపించుకున్నాడు. యాదగిరి కంజర్ల ఎడిటింగ్ పనితీరు బాగుంది. టి.గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికృష్ణ ఆశీస్సులతో దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.తన ఫ్రెండ్స్ సహకారంతో తను అనుకున్న లక్ష్యం కోసం బడ్జెట్ లేకుండా జీరో బడ్జెట్ సినిమా తీసి, మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నవీన్ కుమార్ గట్టు పెద్ద సినిమాలు తీయగలడని మనకు అర్థం అవుతుంది. తెలంగాణలో దొరల బానిసత్వం గురించి తెలుపుతూ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నివ్వడమే కాకుండా ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాల్లో ‘శరపంజరం’ ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు.