Tollywood: “రౌడీ బేబీ” కాస్త ‘గ‌ల్లీ రౌడీ’ అయింది..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం రౌడీ బేబి. ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా బ్యాన‌ర్ల‌పై ఎం.వివి స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా టైటిల్‌ను మార్చ‌బోతున్నామ‌ని.. కొత్త టైటిల్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని కోన వెంక‌ట్ ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. తాజాగా ఈ సినిమా కొత్త టైటిల్‌ను ప్ర‌క‌టించారు.

Gally rowdy

Tollywoodరౌడీ బేబి టైటిల్‌ను గ‌ల్లీ రౌడీగా మారుస్తున్న‌ట్లు తెలియ‌జేస్తూ చిత్ర‌బృందం ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీనిని ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ పూరీ జ‌గ‌న్నాథ్‌, హ‌రీష్ శంక‌ర్‌, గోపీచంద్ మ‌లినేని, శివ నిర్వాణ‌, బాబీ లాంచ్ చేశారు. ఇక గ‌ల్లీ రౌడీ చిత్రంలో న‌ట‌కీరీటీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌, నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ బాబీ సింహ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో సందీప్‌కు జోడీగా నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది.