టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కఫుల్ ఎవరంటే నాగచైతన్య -సమంత జంట అని ఎవరైనా చెబుతారు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో పరిచయమైన వీరిద్దరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారడంతో చివరికి కలిసి ఏడడుగులు నడిచారు. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది స్యామ్. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. అభిమానులు అడిగే అనేక పర్సనల్, సినిమాలకు సంబంధించిన ప్రశ్నలకు తన స్ట్రైల్లో సమంత సమాధానాలు ఇస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో తాజాగా సమంత ఒక ఫొటోను సోషల్ మీడియా పంచుకోగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఒక నెటిజన్ మాత్రం వినూత్నంగా ఆ ఫొటోపై కామెంట్ చేశాడు. ‘నాగచైతన్యకి విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో సమంత’ అని ఒక అభిమాని వినూత్నంగా కామెంట్ చేశాడు. దీనికి సమంత ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘చైతూను వదిలేయడం చాలా కష్టం.. ఒక పనిచేయ్.. ఈ విషయం గురించి నువ్వే చైతూను అడుగు’ అని సమంత సరదాగా కౌంటర్ ఇచ్చింది. సమంత ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చైతూకి విడాకులు ఇచ్చేయ్ అని అడిగిన ప్రశ్నకు.. సమంత ఇంత కూల్‌గా సమాధానం ఇవ్వడాన్ని చూసి ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు.