వైరల్‌గా మారిన పరిణితి ‘సైనా నెహ్వాల్’ లుక్

బ్యాడ్మింటన్ స్టార్, మాజీ ప్రపంచ నెంబర్ 1 షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతోంది. ఇందులో సైనా నెహ్వాల్ పాత్ర పాత్రను ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా పోషిస్తుండగా.. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో సైనా నెహ్వాల్ పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు పరిణితి చోప్రా వర్కౌట్లు చేస్తోంది. బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేస్తూ త్వరలో జరగనున్న షూటింగ్‌కు రెడీ అవుతోంది. అందులో భాగంగా వర్క్ షాప్స్‌లో పాల్గొంటోంది.

pariniti chopra

ఈ క్రమంలో పరిణితి చోప్రా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను తాజాగా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దీనిపై సైనా నెహ్వాల్ స్పందించింది. పరిణితి చోప్రా అచ్చం తనలాగే ఉందని, తనను పోలిన వ్యక్తి పరిణితి చోప్రా అని సైనా నెహ్వాల్ తెలిపింది. తన బయోపిక్ తీస్తున్న సినిమా యూనిట్‌కి ధన్యవాదాలు అని సైనా నెహ్వాల్ పేర్కొంది.

గతంలో సైనా నెహ్వాల్ పాత్ర కోసం పరిణితి చోప్రాను సినిమా యూనిట్ ఎంపిక చేయగా.. బిజీ షెడ్యూల్స్ వల్ల దీని నుంచి ఆమె తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో పరిణితి చోప్రాను సినిమా యూనిట్ తీసుకుంది. ఈ సినిమాలో కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రను మానవ్ కౌల్ నటిస్తుండగా.. సుబరాజ్యోతి భరత్ సైనా నెహ్వాల్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.