అక్కినేని ఫ్యామిలీకి పోటీగా సమంత మరో ప్రొడక్షన్?

ఈ మధ్య కాలంలో హీరోల కంటే ఎక్కువగా హీరోయిన్స్ సినిమా ప్రొడక్షన్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఏ మాత్రం మంచి కథలు దొరికినా కూడా సొంతంగా సినిమాలని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అక్కినేని వారి కొడలు సమంత కూడా నిర్మాతగా అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ ప్రొడక్షన్ తో పాటు మనం ఎంటర్ ప్రైజెస్ అని ఒక స్పెషల్ బ్యానర్ ని సిద్ధం చేసుకున్నారు. ఇక ఇప్పుడు సమంత సరికొత్త ప్రయోగాత్మక కథలతో నిర్మాతగా బిజీ అవ్వాలని అనుకుంటోంది. ప్రస్తుతం తమిళ్ లో హీరోయిన్ గా రెండు సినిమాలను చేస్తున్న సమంత త్వరలోనే ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి సమంత ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తుందో చూడాలి.