కొత్త వారికి సల్మాన్ సపోర్ట్.. భారీ స్థాయిలో వెబ్ సిరీస్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఏం చేసినా కూడా జనాలు ఎట్రాక్ట్ అవుతూనే ఉంటారు. లాక్ డౌన్ లో పూర్తిగా తన ఫామ్ హౌజ్ లోనే గడిపిన సల్మాన్ చక్కగా వ్యవసాయ పనులను కూడా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. ఇక ఫైనక్ గా ఈ స్టార్ హీరో బిగ్ బాస్ షోతో ఇప్పుడు బిజీగా మారాడు. 14వ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే మరోవైపు సల్మాన్ కొత్త టాలెంట్ ని సపోర్ట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ లో కొన్ని డిఫరెంట్ కథలను విన్న భాయ్ వెబ్ సిరీస్ లను నిర్మించడానికి కూడా రెడీ అయ్యారట. అందులో సల్మాన్ నటించడు గాని కేవలం ఒక నిర్మాతగా మాత్రమే సపోర్ట్ చేస్తాడట. 2021లో భారీ స్థాయిలో ఒక కొత్త సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుదేవా దర్శకత్వంలో రాధే అనే సినిమాను చేస్తున్న సల్మాన్ ఆ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.