వ్యవసాయం చేసుకుంటున్న స్టార్ హీరో

Salman Khan

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లాక్ డౌన్ సమయం నుండి తన ఫాం-హౌస్లో  ఉంటున్నారు, వందల ఎకరాల్లో విస్తరించి  ఉన్న ఈ ఫామ్ హౌస్ అంటే  సల్మాన్ కు  ఎంతో ఇష్టం.నిత్యం సినిమాలతో బిజీగా ఉండే సల్మాన్ ఖాన్ లాక్‌డౌన్‌ వల్ల ఖాళీ సమయం దొరకడం తో వ్యవసాయదారుడు గా మారిపోయారు.

రోజంతా పొలంలో పని చేసి ఒళ్ళంతా బురద తో అలిసిపోయి కూర్చొని ఉన్న ఒక ఫోటోను సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు .అలాగే సల్లూ భాయ్  ఆ ఫోటో కింద టాగ్ లైన్ లో ”రైతులకు నా వందనం” అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో రాధే  అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.