సౌత్ ఇండస్ట్రీ పై కన్నేసిన ఆలియా భట్ !

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు.తన అందం మరియు నటన తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అలియా  బాహుబలి దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్  మూవీలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

 అయితే తాజాగా ఈ భామ గురించి ఒక సంచలనమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆలియా భట్ మరో రెండు సౌత్ ఇండియన్ భారీ బడ్జెట్ మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యేందుకు  చర్చలు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ – డైరెక్టర్ నాగ్ అశ్విన్  చిత్రంలో మరియు ఎన్టీఆర్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రాలలో కథానాయికగా ఎంపిక అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త కనుక నిజమైతే ఆలియాభట్ బాలీవుడ్ లోనే కాదు ఇటు సౌత్ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్ గా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి