లోకనాయకుడు సరసన అనుష్క శెట్టి?

Anushka Shetty

టాలీవుడ్ స్టార్ లేడీ అనుష్క శెట్టి నటించిన సైలెన్స్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది అయితే లాక్‌డౌన్‌ పరిస్థితుల రీత్యా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది.అనుష్క ఈ చిత్రంలో ఓ మూగ  పెయింటర్ పాత్రను  పోషించారు.తాజాగా అనుష్క ఒక క్రేజీ తమిళ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.


తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన వేట్టైయాడు వేళైయాడు చిత్రంకు  సీక్వెల్  ప్లాన్ చేస్తున్నారు.2006లో విడుదలైన ఈ చిత్రం, తెలుగులో రాఘవన్  అనే పేరుతో విడుదల అయ్యింది.అటు తమిళ్ మరియు తెలుగులో బాగా ఆడిన ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్. కమల్  హాసన్ పక్కన కథానాయికగా అనుష్కను తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.