పవన్ కళ్యాణ్ పేరుతో పవర్ఫుల్ రికార్డ్

Pawan Kalyan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. దేశవ్యాప్తంగా తన క్రేజ్ తో ఎంతో మందిని ఆకర్షించిన పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తోంది. నెవర్ బిఫోర్ అనేలా అభిమానులు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్వీట్ ని వైరల్ చేసిన విధానం హాట్ టాపిక్ గా మారింది.

కేవలం 24గంటల్లోనే #AdvanceHBDPavanKalyan ట్యాగ్ తో 27.3 మిలియన్ ట్వీట్స్ రావడం అందరిని ఆశ్చర్యనికి గురి చేసింది. పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్క రోజులోనే ఈ స్థాయిలో ట్వీట్స్ రావడం ఇదే మొదటిసారి. అలాగే ఇది ఇండియాలోనే బిగెస్ట్ ట్రెండ్ గా నిలివడం విశేషం. ట్విట్టట్ లో పాత రికార్డులని పవన్ కళ్యాణ్ మ్యానియాలో కొట్టుకుపోయాయి. అసలైతే పవర్ స్టార్ బర్త్ డే డేట్ సెప్టెంబర్ 2. కానీ అభిమానులు నెల ముందు నుంచే రికార్డులు క్రియేట్ చేస్తున్నారు అంటే బర్త్ డే రోజు జోష్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.