సైన్స్ ఫిక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందీప్ కిషన్

Sandeep Kishan

ఎక్కడికి పోతావు చిన్నవాడ, టైగర్, ఒక్కక్షణం వంటి ప్రయోగాత్మకమైన కథలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విఐ.ఆనంద్. కొన్ని నెలల క్రితం రవితేజతో డిస్కో రాజా అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆనంద్ ఎంచుకున్న కాన్సెప్ట్ కి మంచి ప్రశంసలు దక్కాయి.

అయితే మరోసారి ఈ జీనియస్ డైరెక్టర్ యంగ్ టాలెంటేడ్ హీరోతో కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు.. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా యూత్ లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ని అందుకున్న సందీప్ కిషన్. గతంలో ఆనంద్, సందీప్ కాంబినేషన్ లో టైగర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ చాలా కాలం తరువాత వీరిద్దరు కలిసి ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ కాంబినేషన్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వెలువడనుంది.