డాన్స్ కొరియోగ్రాఫర్ గా మారనున్న సాయి పల్లవి?

sai pallavi

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న రాబోయే తెలుగు చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన అనేక ప్రచార చిత్రాలు మరియు సాంగ్స్ ద్వారా ఆడియన్స్ లో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో పెండింగ్ ఉన్న ఒక పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చేయమని సాయిపల్లవిని దర్శకుడు శేఖర్ కమ్ముల కోరినట్లు సమాచారం.సినిమాల్లోకి రాకముందు సాయి పల్లవి అనేక డాన్స్ షోలలో తన డాన్స్ మరియు కొరియోగ్రఫీ ప్రతిభను నిరూపించుకోవడం తో శేఖర్ కమ్ముల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి కావడంతో లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన 10 శాతం షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం ఆలోచిస్తుంది. మరికొద్ది రోజుల్లో హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం.