బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇప్పటికే అనేక కేసుల్లో ఇరుకున్న విషయం తెలిసిందే. గతంలో జింకను వేటాడిన కేసుతో పాటు పబ్లిక్‌లో అతిగా ప్రవర్తించిన పలు కేసుల్లో చిక్కుకున్నాడు. కానీ ఇప్పుడు సల్మాన్‌ఖాన్ సోదరులైన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ ఒక కేసులో చిక్కుకున్నారు. కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు గాను సల్మాన్ బ్రదర్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
డిసెంబర్లో సల్మాన్ సోదరులు దుబాయ్ వెళ్లగా.. డిసెంబర్ 25న తిరిగి ముంబైకి చేరుకున్నారు. విదేశాలకు వెళ్లి వచ్చినవారు కరోనా నిబంధనల ప్రకారం తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ఆ 14 రోజుల తర్వాత నిర్వహించిన టెస్టుల్లో నెగిటివ్ వస్తే ఇంటికి వెళ్లాలి. కానీ ఈ నిబంధనలను అతిక్రమించినందుకు గాను సల్మాన్ సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అధికారులు వీరిని ఒక హోటల్లోని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. కానీ వారిద్దరి అక్కడ ఉండకుండా ఇంటికి వెళ్లిపోయారు. క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులు ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు.