6 ఏళ్లలో అక్షయ్ ఆదాయం ఎంతో తెలిస్తే షాక్

బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు.. నిర్మాతలకు కలెక్షన్ల పంట పడుతోంది. కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే హీరోలలో అక్షయ్ తొలి స్థానంలో ఉంటాడు. అందుకని అక్షయ్‌తో సినిమా చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతుంటారు. ఆయనకు భారీ రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేస్తూ ఉంటారు. దీంతో బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే టాప్ హీరోగా ఇప్పటికీ అక్షయ్ కొనసాగుతున్నాడు.

akshay kumar income
akshay kumar income

అక్షయ్ గత 6 సంవత్సరాల ఆదాయాలు చూస్తే.. 1744 కోట్ల రూపాయాలుగా తేలింది. 2014 నుంచి 2020 వరకు దాదాపు 2 వేల కోట్లు సంపాదించాడని తేలింది. కరోనా టైమ్‌లో కూడా అక్షయ్ భారీగా సంపాదించాడు. ఈ ఏడాది అక్షయ్ ఆదాయం రూ.356.57 కోట్లుగా తేలింది. ఇక 2019లో రూ.459.22 కోట్లు, 2018లో రూ.277.06 కోట్లు, 2017లో రూ.231.06 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2015లో రూ.208.42 కోట్లు సంపాదించాడు.

గత ఆరు సంవత్సరాల్లో దాదాపు అక్షయ్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా తన సినిమా లాభాల్లో అక్షయ్‌కు కూడా వాటా ఉంటుంది. దీంతో పాటు ప్రకటనలలో యాక్ట్ చేయడం వల్ల అక్షయ్‌ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అటు అక్షయ్ ప్రొడ్యూసర్‌గా మారి పలు సినిమాలు నిర్మించగా.. అవి హిట్ కావడంతో మరింత ఆదాయం వచ్చింది.