కలకత్తా నేపథ్యంలో రూపొందుతోన్న నేచురల్‌స్టార్ నాని శ్యామ్‌సింగరాయ్
ఇటీవలి కాలంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నాని, దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మరియు నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.
మే9 సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్‌డే విశెష్ తెలుపుతూ శ్యామ్‌సింగరాయ్ చిత్రం నుండి ఆకర్షనీయమైన ఫస్ట్‌లుక్ పోస్టర్ ని విడుదలచేశారు మేకర్స్. సాంప్రదాయమైన బెంగాళ్ చీరకట్టులో త్రిశూలం పట్టుకొని సాయి పల్లవి పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. అంతేకాదు ఈ లుక్‌ను గమనించినట్టైతే భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో అమ్మవారి పండుగ సంబరాలు జరిగే నేపథ్యంలో తెరకెక్కించిన పాటలోనిదని తెలుస్తోంది.
ప్రతి పాత్రలో విలక్షణతను ప్రదర్శించే నాని శ్యామ్‌సింగరాయ్ చిత్రంలో బెంగాళీ వ్యక్తిగా కనిపించనున్నారు. నేచురల్‌స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా విడుదలచేసిన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా నిర్మించిన భారీసెట్లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.
ఫస్ట్‌టైమ్ నాని, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీలో నాని సరికొత్త రూపంలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ తో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఓ స్పెషల్ ఫిల్మ్‌గా ఉండబోతుంది.
సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని
ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు.
జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు: నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం తదితరులు
సాంకేతిక నిపుణులు
డైరెక్టర్: రాహుల్ సంకృత్యాన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్టైన్మెంట్
ఒరిజినల్ స్టోరీ: సత్యదేవ్ జంగా
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ .వెంకటరత్నం (వెంకట్)
ఎడిటర్: నవీన్నూలి
పీఆర్ఒ:వంశీ –శేఖర్