ఆ నటుడంటే నాకు చాలా భయం

ఫిదా సినిమా హిట్‌తో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఆ తర్వాత వరుస అవకాశాలను కొట్టేస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుండగా… దీని షూటింగ్ పూర్తి అయింది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాల్లో నటిస్తోంది సాయిపల్లవి. స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.

SAI PALLAVI

అయితే ఒక సినిమా సెట్‌లో నటుడు ప్రకాశ్ రాజ్‌ని చూసి సాయిపల్లవి భయపడిందట. ఈ విషయాన్ని తాజాగా సాయిపల్లవి స్వయంగా బయటపెట్టింది. పావకదైగల్ అనే తమిళ సినిమాలో సాయి పల్లవికి తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. డిసెంబర్ 18న ఈ మూవీని నెట్‏ఫ్లిక్స్‏లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ..తండ్రిగా ప్రకాశ్ రాజ్ సెట్‏లో నడుచుకుని వస్తుంటే.. ఆయన గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని అని చెప్పింది. ఆయన దాదాపు సెట్‏లో క్యారెక్టర్‏లో ఉండేవారని తెలిపింది.

ఇక పర్సనల్ విషయాలు గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడం పూర్తయ్యాక కచ్చితంగా వైద్య వృత్తిపై దృష్టి పెడతానని, దాన్నే కొనసాగిస్తానంది. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదని, డాక్టర్ వృత్తిపై అంటే తనకంటే ఎంతో గౌరవం ఉందని చెప్పింది.