రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత

పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం తాను రెండో పెళ్లి చేసుకోనున్నట్లు సోమవారం సింగర్ సునీత తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సునీతకు అభిమానులు విషెస్ చెబుతున్నారు. మీరు హ్యాపీగా ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకోనుండగా.. సోమవారం ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆమె ఎంగేజ్ మెంట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్లో హాల్ చల్ చేస్తున్నాయి.

SUNITHA

ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ పూర్తవ్వగా.. పెళ్లి డేట్‌ను కూడా బంధువులు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది, జనవరిలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీత వెల్లడించింది. తన కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య నిరాడంబరంగా పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. రామ్‌కు కూడా ఇది రెండో వివాహం అని తెలుస్తోంది.

సునీతకు 19 ఏళ్ల వయస్సుల్లో పెళ్లి కాగా.. కొన్నేళ్ల తర్వాత భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఒంటరిగా ఉండగా.. సునీత రెండో పెళ్లి చేసుకోనుందని అనేకసార్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని సునీత కొట్టిపారేసింది. ఇటీవల కొద్దిరోజుల క్రితం సునీత రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ ఇప్పుడు సునీత రెండో పెళ్లికి సిద్ధమైంది.