ఫిదా సినిమా హిట్‌తో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఆ తర్వాత వరుస అవకాశాలను కొట్టేస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుండగా… దీని షూటింగ్ పూర్తి అయింది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాల్లో నటిస్తోంది సాయిపల్లవి. స్టార్ హీరోల సరసన కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.
అయితే ఒక సినిమా సెట్లో నటుడు ప్రకాశ్ రాజ్‌ని చూసి సాయిపల్లవి భయపడిందట. ఈ విషయాన్ని తాజాగా సాయిపల్లవి స్వయంగా బయటపెట్టింది. పావకదైగల్ అనే తమిళ సినిమాలో సాయి పల్లవికి తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటించాడు. డిసెంబర్ 18న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ..తండ్రిగా ప్రకాశ్ రాజ్ సెట్లో నడుచుకుని వస్తుంటే.. ఆయన గాంభీర్యం చూసి చాలా భయపడేదాన్ని అని చెప్పింది. ఆయన దాదాపు సెట్లో క్యారెక్టర్లో ఉండేవారని తెలిపింది.
ఇక పర్సనల్ విషయాలు గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో నటించడం పూర్తయ్యాక కచ్చితంగా వైద్య వృత్తిపై దృష్టి పెడతానని, దాన్నే కొనసాగిస్తానంది. ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదని, డాక్టర్ వృత్తిపై అంటే తనకంటే ఎంతో గౌరవం ఉందని చెప్పింది.