సాహో భామ గ్లామర్ షో…

ఎవ్లీన్‌ శర్మ… సాహోకి ముందు పదిహేడు సినిమాలు చేసినా దక్షిణాది ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేని పేరు. జర్మన్‌ మోడల్‌గా పాపులర్‌ అయిన అందాల భామ ఎవ్లీన్‌ శర్మ, ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా జబ్ హ్యారీ మెట్ సెహగల్ సినిమాలో కూడా మెరిసిన ఈ బ్యూటీ అనుకున్న స్టార్ స్టేటస్ రాలేదు అనుకుందో ఏమో కానీ సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ ఫాలోవెర్స్ ని సంతోష పెడుతుంది. తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌లో క్లోజప్‌లో పోజిచ్చిన ఎవ్లీన్‌ శర్మ, ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మడి గ్లామర్ షో చూసిన నెటిజెన్స్ ఫోటోని రీట్వీట్ చేస్తూ ఖుషి అవుతున్నారు.

హిందీలో సోలో హీరోయిన్ గా అంతగా అవకాశాలు రాకపోవడంతో ఎవ్లీన్‌ శర్మ, సౌత్ పై కాన్సెన్ట్రేట్ చేసింది. ‘సాహో’ సినిమాలో ఆఫీసర్ జెన్నిఫర్ పాత్రలో కాసేపు కనిపించిన ఎవ్లీన్‌ శర్మ స్క్రీన్ టైం తక్కువే అయినా తన పాత్రకి న్యాయం చేసింది. అందంగా ఉండడంతో పాటు దాన్ని ఎలా చూపించాలో కూడా తెలిసిన ఎవ్లీన్‌ శర్మ, మంచి అవకాశాలు వస్తే తెలుగు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ బాలీవుడ్ భామకి తెలుగులో సోలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేదెవరో చూడాలి.