సూర్యని కాప్పాన్ కాపాడగలదా

కోలీవుడ్ నటుల్లో ఎలాంటి పాత్రలో అయినా కనిపించి మెప్పించగల హీరో సూర్య. గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్య, తనకి బాగా కలిసొచ్చిన దర్శకుడు కేవీ ఆనంద్ తో ఒక కాప్పాన్ సినిమా చేస్తున్నాడు. తెలుగులో ‘బందోబస్త్’ గా పేరుతో రానున్న ఈ సినిమాలో మోహన్ లాల్, ఆర్య కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. వీడోక్కడే, బ్రథర్స్ తర్వాత ఆనంద్-సూర్య కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్ లో హైప్ బాగానే ఉంది. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్, కాప్పాన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. 1.35 నిముషాల డ్యూరేషన్ తో వచ్చిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ సూర్య అభిమానులని అలరిస్తుంది.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన కాప్పాన్ సినిమా ట్రైలర్ ని ఒక రెగ్యులర్ ఫార్మాట్ లో కట్ చేసిన విధానం కాస్త నిరాశపరుస్తుంది. ఒక పాట, ఒక ఫైట్, ఒక రొమాంటిక్ సీన్, ఒక బ్లాస్టింగ్… ఇదే ఫార్మాట్ రిపీట్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ నిండా బ్యూటిఫుల్ విజువల్స్, సూపర్బ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ సరైన విధంగా చూపించలేదని చెప్పాలి. ట్రైలర్ లోనే కంటెంట్ చెప్పడం ఎందుకు అనుకున్నారో ఏమో కానీ కథకి సంబంధించి కూడా ఇవ్వకుండా కాప్పాన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో చూపించిన ప్రతి సీన్ ని విడివిడిగా చూస్తే కాప్పాన్ లో యాక్షన్ సినిమాలని ఇష్టపడే వారికి బాగా కనెక్ట్ అయ్యే విషయాలు ఉన్నాయనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. మరి ఈ మూవీతో హిట్ ఇచ్చి సూర్య సక్సస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.