ఇది కదరా మన సినిమా స్థాయి… బాహుబలి ఊపిరి పీల్చుకో ఆర్ ఆర్ ఆర్ వస్తోంది

బాహుబలి… బాహుబలి… బాహుబలి… వంద కోట్లు కూడా వసూళ్ళు కష్టమైన తెలుగు సినిమాతో ఇండియా మొత్తం కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా. బాహుబలి బాహుబలి అని అన్నీ ఇండస్ట్రీల సినీ అభిమానులు థియేటర్స్ లో జేజేలు కొట్టిన ఈ మూవీని రాజమౌళి ఒక మహాకావ్యంలా తీర్చిదిద్దాడు. దాదాపు అయిదేళ్ల పటు తెరకిక్కిన ఈ మూవీ మేకింగ్ వీడియో 88.4 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఒక మేకింగ్ వీడియో ఇన్ని వ్యూస్ రాబట్టింది అంటే బాహుబలి మూవీ కోసం ఫాన్స్ ఎంతగా వెయిట్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన బాహుబలి తర్వాత చాలా సినిమాలు బాక్సాఫీస్ దెగ్గర హిట్ అయ్యాయి కానీ ఏ స్టార్ హీరో మూవీ కూడా బాహుబలి రికార్డులని టచ్ కూడా చేయలేక పోయాయి.

ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాహుబలి కోటకి బీటలు వారెలా చేయడానికి సిద్దమవుతున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తే బాహుబలి రికార్డులు బ్రేక్ అవ్వడానికి ఈరోజే పునాదులు పడ్డాయని అర్ధమవుతుంది. కీరవాణి ఇచ్చిన టేర్రిఫిక్ మ్యూజిక్ కి, బ్లేజ్ పాడిన ర్యాప్ కి ఈ 1:48 నిడివి గల వీడియో అందరి ఫోన్స్ లో సునామినే సృష్టిస్తోంది. యుట్యూబ్ నుంచి సోషల్ మీడియా వరకూ ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ జపం జరుగుతోంది. రాజమౌళి టీం ఇంట్రడక్షన్ తో మొదలైన ఈ వీడియోలో ట్రిపుల్ ఆర్ గ్రాండియర్ ని ప్రెజెంట్ చేస్తూ భారి సెట్స్ ని, ఫాస్ట్ పేస్ యాక్షన్ ఎపిసోడ్స్ మేకింగ్ ని సుపర్బ్ గా ప్రెజెంట్ చేశారు. ఎన్టీఆర్ చరణ్ తో పాటు మెయిన్ కాస్ట్ అందరినీ అక్కడక్కడా చూపించిన మేకింగ్ వీడియో ఆర్ ఆర్ ఆర్ స్థాయి ఏంటో ప్రపంచానికి చూపించింది. ఇది కదా రాజమౌళి సినిమా అంటే అని నిరూపించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ చరణ్ ల షాట్స్ మేకింగ్ లోనే ఇలా ఉంటే తెరపై ఎలా ఉంటుందో అనే ఊహకే గూస్ బంప్స్ రావడం గ్యరెంటి. మొత్తానికి బ్లాక్ బస్టర్ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ వచ్చిన ఈ మెస్మరైజింగ్ మేకింగ్ వీడియో మన సినిమా స్థాయిని మరోసారి అందరికీ తెలిసేలా చేసింది. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్, రాజమౌళి మ్యాజిక్, బాలీవుడ్ స్టార్స్ ఇమేజ్ అన్నీ కలిసి ఈ మేకింగ్ వీడియోని ఆల్ ఇండియా ఫ్యాన్స్ కలిసి 88.4 మిలియన్ వ్యూస్ దాటిస్తే బాహుబలి రికార్డు బద్దలైపోయినట్లే. .