రణ్‌బీర్ ‘ఎనిమల్’ సినిమాలో తృప్తి

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ అక్కడ కూడా రాణిస్తున్నాడు. హిందీలో కబీర్‌సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో కూడా పేరు తెచ్చుకున్న సందీప్ వంగా.. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘ఎనిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా పరిణితి చోప్రాను తీసుకున్నారు. కానీ ఇందులో ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉండటంతో.. మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రీని తీసుకున్నట్లు సమాచారం.

ripti dimri in animal
ripti dimri in animal

తృప్తి కంటే ముందు సారా అలీఖాన్‌తో పాటు పలువురు హీరోయిన్లను సినిమా యూనిట్ పరిశీలించింది. కానీ కథకు తృప్తి అయితే బాగా సరిపోతుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేశారు. అనుష్కశర్మ నటించిన బుల్‌బుల్ సినిమాతో తృప్తి మంచి పేరు తెచ్చుకుంది. అంతకుముందు ‘లైలా మజ్ను’, ‘పోస్టర్‌బాయ్స్‌ సినిమాల్లో నటించింది.

పరిణీతి చోప్రా, తృప్తిలతో కలిసి రణ్‌బీర్ సినిమా చేయడం ఇదే తొలిసారి. ఇక ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.