అందులో ఛాన్స్ వస్తే అసలు వదులుకోను

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్నా ముందు ఉంటుంది. స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు కొట్టేస్తూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న రష్మిక… ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది.

rashmika mandanna biopic
rashmika mandanna biopic

ఇక ఇటీవలే బాలీవుడ్‌లో కూడా రష్మిక ఒక సినిమా అవకాశాన్ని దక్కించుకుని పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు రష్మిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మీకు బయోపిక్ సినిమాలలో నటించడానికి అవకాశం లభిస్తే.. ఎవరి కథను ఎంచుకున్నారని అడగ్గా.. శ్రీదేవి, సౌందర్య జీవిత కథలలో నటిస్తానని చెప్పింది.

వీరిద్దరి రోల్స్‌లో అవకాశం వస్తే మాత్రం అసలు వదులుకోనని రష్మిక సమాధానమిచ్చింది. వారిద్దరు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం శ్రీదేవి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇందులో రష్మికకు అవకాశం దక్కుతుందో.. లేదో చూడాలి.