ఇన్వెస్టిగేషన్ లో’సినీ’ ప్రముఖుల పేర్లను బయటపెట్టిన’రియా చక్రవర్తి’!!

సంచలనాత్మక డ్రగ్స్ కుంభకోణంలో బెయిల్ అప్పీల్‌ను ముంబైలోని సెషన్స్ కోర్టు ఖండించడంతో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్నారు. ఎన్‌సిబి విచారణ సందర్భంగా రియా దాదాపు 25 మంది ప్రముఖ సెలబ్రెటీల పేర్లను బయటపెట్టినట్లు తెలుస్తోంది. వారందరు మాదకద్రవ్యాల దుర్వినియోగానికి పాల్పడినట్లు వెల్లడించారు.

నటి సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్, డిజైనర్ సిమోన్ ఖంబట్టా, సుశాంత్ స్నేహితుడు మరియు మాజీ మేనేజర్ రోహిణి అయ్యర్ , ముఖేష్ ఛబ్రా వంటి వారికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు రియా ఇన్వెస్టిగేషన్ లో బయటపెట్టినట్లు సమాచారం.
రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ నుండి డ్రగ్ యాంగిల్ వెలువడడంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసు దర్యాప్తు విషాదకరమైన మలుపు తిరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించి, రియాను, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ దీపేశ్ సావంత్ మరియు కొంతమంది డ్రగ్ పెడ్లర్లను విచారించి అరెస్టు చేశారు.