‘బిగ్ బాస్’ 4: ‘గంగవ్వ’ ఎన్ని వారాలు ఉంటుందంటే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 గ్రాండ్ గా మొదలైనప్పటికి కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం ఓ వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎవరు కూడా అనుకున్నంత స్టార్ సేకబ్రెటీస్ కాదనే కామెంట్స్ చేస్తున్నారు. అయితే షో నిర్వాహకులు అద్భుతమైన టాస్క్ లతో బజ్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ఇక గంగవ్వకు అభిమానుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఒక సాదారణ పల్లెటూరి బామ్మ ఈ వయసులో పోరాడుతున్న అందరికి ఒక స్ఫూర్తి దాయకమని బిగ్ బాస్ 2 విన్నర్ కౌషల్ మండా తెలిపారు. ఫిజికల్ టాస్క్ లలో బలంగా ఉంటేనే ఫైనల్ కి చేరుకుంటారని అనుకోవడం పొరపాటే. గీతా మాధురి ఫిజికల్ టాస్క్ లో నెమ్మదిగా ఉన్నప్పటికీ ఆమె ఫైనల్ వరకు చేరుకుంది. ఇక గంగవ్వని చూస్తుంటే ఆమె 10వారాలకు పైగానే బిగ్ బాస్ షోలో సందడి చేస్తుందని కౌషల్ వివరణ ఇచ్చారు. ఇక హౌజ్ లో సూర్య కిరణ్ దూకుడు ఎక్కువయ్యిందని కూడా కౌషల్ సెటైర్ వేశారు.