కేజీఎఫ్ టీజ‌ర్ రికార్డు.. రాంగోపాల్‌వ‌ర్మ వ్యాఖ్య‌లు!

కేజీఎఫ్-2 టీజ‌ర్ దూసుకుపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో రికార్డులు తిర‌గ‌రాస్తున్నాడు రాకీ భాయ్‌. య‌శ్ హీరోగా నటించిన తాజా చిత్రం కేజీఎఫ్-2 టీజ‌ర్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ టీజ‌ర్ విడుద‌లైన 48గంట‌ల్లోపే ఈ చిత్రం 100మిలియ‌న్స్ వ్యూస్ ద‌క్కించుకుంది. ఇప్పుడు తాజాగా టీజ‌ర్ రికార్డుల‌పై స్పందించిన రాంగోపాల్‌వ‌ర్మ చిత్ర‌యూనిట్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

rgv about kgf-2

రెండేళ్ల క్రితం బాలీవుడ్ మాత్ర‌మే కాకుండా ద‌క్షిణాది చిత్ర‌ప‌రిశ్ర‌మ కూడా క‌న్న‌డ సినీ ఇండ‌స్ట్రీని స‌రిగ్గా గుర్తించ‌లేద‌ని.. కానీ కేజీఎఫ్‌-2తో ప్ర‌శాంత్‌నీల్‌, య‌శ్ ప్ర‌స్తుతం క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తీసుకువ‌చ్చార‌ని రాంగోపాల్‌వ‌ర్మ పేర్కొన్నారు. కాగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తెర‌కెక్కిన ప‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో పోల్చుతూ కేజీఎఫ్-2పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. భారీ బ‌డ్జెట్ చిత్రాల టీజర్లు కోట్ల‌లో వ్యూస్ సాధించ‌డానికి కొన్ని నెల‌ల స‌మ‌యం పట్టింద‌ని.. కానీ కేజీఎఫ్‌-2 టీజ‌ర్ మూడు రోజుల్లోనే 15కోట్ల వ్యూస్ సాధించిద‌ని.. దీంతో అన్ని సినీ పరిశ్ర‌మ‌ల‌కు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్‌ గట్టిగా పంచ్ ఇచ్చాడ‌ని ఆర్జీవీ అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అధీరా పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ పోషిస్తుండ‌గా.. ర‌వీనాటాండ‌న్‌, శ్రీ‌నిధి శెట్టి, ప్ర‌కాశ్‌రాజ్‌, రావుర‌మేశ్‌, ఈశ్వ‌రిరావు, అర్చ‌న జాయ్స్ కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించే చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ ప‌తాకంపై విజ‌య్ కిరంగ‌దూర్ నిర్మిస్తున్నారు.