యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న వ‌కీల్‌సాబ్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ న‌టించిన‌ తాజా చిత్రం వ‌కీల్‌సాబ్ టీజ‌ర్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఎంతో ఎదురుగా చూస్తోన్న అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చారు ప‌వ‌న్‌. సంక్రాంతి కానుక‌గా ప‌వ‌ర్ ప్యాక్ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్ ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ప‌వ‌న్ చెప్పిన డైలాగ్స్‌.. ప‌వ‌న్ లుక్ ఆక‌ట్టుకుంటున్నాయి. కోర్టులో వాదించ‌డ‌మూ తెలుసు.. కోటు తీసి కొట్ట‌డ‌మూ తెలుసు అంటూ ప‌వ‌న్ చెప్పిన డైలాగ్ అభిమానుల‌కు గూస్‌బంప్స్ తెప్పించింది.

vakeelsaab teaser

ఇప్ప‌టికే ఎనిమిది మిలియ‌న్ల పైగా వ్యూస్ పొందిన వ‌కీల్‌సాబ్ టీజ‌ర్‌.. ఏడు ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ సంపాదించి వ‌కీల్‌సాబ్ టాప్‌లో నిలిచింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్ర‌మైన పింక్ రీమేక్‌గా వ‌స్తున్న వ‌కీల్‌సాబ్ చిత్రాన్ని శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతిహాస‌న్ హీరోయిన్ న‌టిస్తుండ‌గా.. అంజ‌లి, నివేధా ధామ‌స్‌, అన‌న్యలు ఈసినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో పోషిస్తున్నారు. ఇక ఎస్‌.ఎస్. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.‌