Renudeshai: పవర్‌స్టార్ పవన్‌కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. తనకు సంబంధించిన ఏదైనా విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. సినిమాల విషయం కానీ, సామాజిక అంశాలపై వంటి విషయాల గురించి మాట్లాడుతుంది రేణు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పలు వ్యాఖ్యలు చేసింది.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మసీదు, చర్చి, దేవాలయాలపై వ్యాఖ్యలు చేసిందిRenudeshai. ఇందుకు సంబంధించిన వీడియో ప్రొమో బయటకు వచ్చింది. దీంట్లో రేణు మాట్లాడుతూ..
మన దేశంలో మసీదులు, చర్చిలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయి.. దేవాలయాలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.. అలాంటప్పుడు భారత్ లౌకిక దేశం ఎలా అవుతుంది?.. అలా అనీ మసీదులు, చర్చిలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువాలని నేను చెప్పడంలేదు.. కానీ దేవాలయాలను కూడా ప్రభుత్వ అధీనం నుంచి తప్పించవచ్చు కదా అని వ్యాఖ్యలు చేసింది రేణుRenudeshai. ఇదిలాఉంచితే నిన్న తిరుమల తిరుపతి శ్రీవారిని అకీరా నందన్, ఆద్యతో కలిసి Renudeshaiరేణు దేశాయి దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.