తన రెండు కార్లను అమ్మేసిన రేణూ దేశాయ్.. ఎందుకంటే?

నటిగానే కాకుండా రచయితగా, దర్శకురాలిగా , నిర్మాతగా, దర్శకురాలిగా ఇలా అన్ని కోణాల్లో అనుభవం ఉన్న రేణూ దేశాయ్ కి మంచి బిజినెస్ నాలెడ్జ్ కూడా ఉంది. షేర్ మర్కెట్స్ లో తెలివిగా ఇన్వెస్ట్ చేసి లాభాలు అందుకుంటున్నట్లు పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపింది. అయితే ఇటీవల రేణు దేశాయ్ తన రెండు ఖరీదైన కార్లను అమ్ముకుందట.

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో తన కార్లను అమ్మేసినట్లు వివరణ ఇచ్చింది. ఎందుకంటే పెట్రోల్ , డీజిల్ వాడకం వల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు పొంచి ఉందని అందుకోసం తన దగ్గర ఉన్న ఆడి ఏ6, పోర్ష్ బాక్స్టెర్ లగ్జరీ కార్లను రేణూ అమ్మేసిందట. ఈ కార్లను అధ్య, అకిరాలకు నచ్చడంతో కొనుగోలు చేసిన రేణూ దేశాయ్ ఇప్పుడు పర్యవరణ పరిరక్షణ కోసం వాటిని అమ్మేసి ఎలక్ట్రికల్ కారును కొనుగోలు చేసినట్లు వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోను కూడా రేణూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.