రియా చక్రవర్తి కేసులో న్యూ ట్విస్ట్.. కాల్ లిస్టులో రానా, రకుల్

Rhea Chakraborty

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలువడుతోంది. రియా చక్రవర్తిని ఈడి అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆమె కాల్ లిస్ట్ పై ఆరా తీయగా అందులో బడా స్టార్స్ కూడా ఉండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రెటీస్ రానా దగ్గుబాటి, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

రియా ఎవరెవరికి ఎన్ని సార్లు కాల్స్ చేసింది అనే విషయాలు చాలానే బయటపడుతున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ కి 30సార్లు కాల్స్ చేయగా..రకుల్ నుంచి రియాకు 14 కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రానా దగ్గుబాటికి 7సార్లు కాల్ చేయగా రానా నుంచి 3 కాల్స్ వచ్చినట్లు సమాచారం. ఆదిత్య రాయ్ కపూర్ కి 16 కాల్స్ ఉండగా.. అతని నుంచి 7 కాల్స్ వచ్చాయి. శ్రద్దా కపూర్ కి మూడు కాల్స్, శ్రద్దా కపూర్ నుంచి రెండు కాల్స్ వచ్చాయి. ఇక సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కి కూడా రియా కాల్ చేయగా ఆయన నుంచి మెస్సేజ్ లు కూడా వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి రియా వారితో ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది అనే విషయాలు మరింత లోతుగా విచారిస్తున్నారు.