ప్రభాస్ పాత ఫోటో కొత్తగా వైరల్ అవుతుంది…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… టాలీవుడ్ హంక్ లాగా ఉండే ఈ పాన్ ఇండియా స్టార్ స్టైలిష్ అండ్ హ్యాండ్ సమ్ గా ఉంటాడు. ప్రభాస్ కి సంబందించిన ఏ ఫోటో బయటకి వచ్చినా ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వాల్సిందే. బాహుబలి తర్వాత మరింత క్రేజ్ పెంచుకున్న ప్రభాస్ పాత ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఈ ఫొటోలో ప్రభాస్ గన్ పట్టుకోని, లెదర్ జాకెట్ వేసుకోని అల్ట్రా స్టైలిష్ గా ఉన్నాడు. అన్నింటికీ మించి ప్రభాస్ క్లీన్ షేవ్ లో ఉండడం ఈ పిక్ లో స్పెషాలిటీ, దాదాపుగా గడ్డంతోనే ఉండే ప్రభాస్ ఇలా క్లీన్ షేవ్ లో కనిపించడం అరుదే.

వైరల్ అవుతున్న ఈ ఫోటో చూస్తుంటే ప్రభాస్ డెబ్యూకి ముందు, అంటే ఈశ్వర్ సినిమా కన్నా ముందు చేసిన ఫోటో షూట్ లాగా ఉంది. అప్పటి ఫోటో ఇప్పుడు బయటికి ఎలా వచ్చిందో తెలియదు కానీ రెబల్ స్టార్ అభిమానులు మాత్రం మా హీరో అప్పటికీ ఇప్పటికీ అలానే ఉన్నాడు అంటూ నెట్ లో సందడి చేస్తున్నారు.