డ్రగ్స్ కేసులో ఢిల్లీ కోర్ట్ మెట్లు ఎక్కిన రకుల్ ప్రీత్

సుశాంత్ రాజపుత్ మరణం బాలీవుడ్ లో మంటలు రేపింది. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో 25 మంది బాలీవుడ్ స్టార్ల పేర్లు బయట పెట్టిందని, వారిలో సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ల పేర్లు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయ్యింది. ఎప్పుడూ జిమ్ లో ఉండే రకుల్, మాదక ద్రవ్యాలు తీసుకుందని వార్త రావడంతో ఇంటర్నెట్ లో ఆమెపై ట్రోలింగ్ మొదలయ్యింది. ఈ ట్రోలింగ్ తీవ్ర స్థాయికి చేరినా రకుల్ కానీ సారా కానీ ఈ విషయంపై స్పందించలేదు.

స్కాండల్ లో ఉన్న వారు విమర్శలు వచ్చినా మౌనంగా ఉండడంతో అది నిజమే అయ్యి ఉండొచ్చని కొన్ని న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా హల్చల్ చేశాయి. ఇక చేసేదేమి లేక రకుల్ ఢిల్లీ కోర్ట్ ని ఆశ్రయించింది. తన పేరున న్యూస్ చానెల్స్ లో, ఇంటర్నెట్ లో జరిగే చర్చని ఆపాలంటూ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఢిల్లీ కోర్టు ప్రసార భారతికి, NCBకి నోటిస్ ఇచ్చింది. ఇదిలా ఉంటే రియా అసలు ఎవరి పేరు చెప్పలేదని, ఎలాంటి లిస్ట్ ప్రిపేర్ చేయలేదని NCB డిప్యూటీ డైరెక్టర్ K.P.S మల్హోత్రా స్పష్టం చేశాడు.