దందా షురూ చేయడానికి రెడీ అవుతున్న రాకీ భాయ్

కన్నడ సినిమా స్థాయిని పెంచిన మూవీ కేజీఎఫ్. రీజనల్ సినిమాలని మాత్రమే తీసే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక మూవీ వచ్చి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందని ఎవరూ అనుకోని ఉండరు. అలాంటి ఆలోచన కూడా చేయడానికి శాండల్ వుడ్ సినీ అభిమానులే డైలమాలో ఉండి ఉంటారు. అలాంటి వారందరి అంచనాలని తలకిందులు చేస్తూ 80 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 280 కోట్ల వసూళ్లు రాబట్టిన ఘనత డెఫినెట్ గా కేజీఎఫ్ సినిమాకే దక్కుతుంది. ఈ మూవీతో హీరో యష్ ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాకీ భాయ్ గా అతని యాటిట్యూడ్ కి, ప్రశాంత్ నీల్ టేకింగ్ కి అన్ని భాషల సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. కేజీఎఫ్ రేంజ్ మరింత పెంచుతూ ఈ మూవీకి సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటుంది.

హైదరాబాద్ లో ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్నారు. చిత్రీకరణ లేకపోవడంతో యష్ కూడా ఇంటికే పరిమితం అయ్యాడు. మళ్లీ అక్టోబర్ రెండో వారంలో కేజీఎఫ్ 2 షూటింగ్ రెస్యూమ్ అవనుండడంతో యష్ బాడీ పెంచే పనిలో పడ్డాడు. ముందు పార్ట్ కన్నా భారీగా, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ తో యష్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించాలి అనుకుంటున్నాడు. అందుకే తన లుక్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా మరింత రఫ్ అండ్ రగ్గడ్ యట్ టోన్డ్ గా కనిపించడానికి సిద్దమయ్యాడు. మరి ఫస్ట్ పార్ట్ తో సంచలనం సృష్టించిన రాకీ భాయ్ సీక్వెల్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.