బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్ కి అసలు కారణం అదేనా

బిగ్ బాస్ ఫేమ్ & యూట్యూబర్ షన్ముక్ జస్వంత్ ఇటీవలే ఓ గంజాయి కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. షణ్ముక్ సోదరుడైన సంపత్ వినయ్ డాక్టర్ మౌనిక అనే యువతిని ప్రేమించి మోసం చేయడంతో ఆమె సంపత్ పై కేసు పెట్టింది. ఈ కేసు విచారణకు సంపత్ ఫ్లాట్ కి పోలీసులు వెళ్ళగా అదే ఫ్లాట్లో షణ్ముక్ గంజాయి తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. తన సోదరుడి కోసం వచ్చిన పోలీసులు షణ్ముక్ నీ అలా చూసి అరెస్టు చేయడం జరిగింది. యూట్యూబర్ అయినా షణ్ముక్ జస్వంత్ బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఇంకా మంచి ఫేమ్ వచ్చింది. అయితే ఈ ఫేమ్ వాడుకుని కొంతమంది అమ్మాయిలను మోసం చేసినట్లు తెలుస్తుంది. యూట్యూబ్లో తన ఒక సూపర్ సార్ అని, తన షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశం ఇస్తానని కొంతమంది అమ్మాయిలను మోసం చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. పట్టుబడ్డ షణ్ముక్ యశ్వంత్ కు వైద్య పరీక్షలు చేయగా తనకి గంజాయి తీసుకుని అలవాటు ఉన్నట్లు వైద్య పరీక్షలు నిర్ధారించబడింది. అయితే నోటీసులు ఇచ్చి షణ్ముఖం విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే కొన్ని పెట్టుబడులు పేరుతో షణ్ముఖ్ జస్వంత్ కొంతమంది దగ్గర డబ్బు తీసుకున్నట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు షణ్ముఖ్ యశ్వంత్ అలాగే తన సోదరుడు సంపత్ వినయ్ పై విచారణ చేస్తున్నారు. అయితే షణ్ముఖ్ జస్వంత్ వలన ఇంకా చాలామంది మోసపోయినట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు.