RGV ‘వ్యూహం’ సినిమా మాయం – కారణం ఏంటో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో రాజకీయానికి సంబందించిన సినిమాలు ఇటీవలే విడుదల కావడం మనం చూస్తున్నాము. గతంలో కూడా 2019 ఎన్నికల సమయంలో యాత్ర, కథానాయకుడు వంటి సినిమాలు రావడం జరిగింది. అలాగే ఇప్పుడు యాత్రా , రాజధాని ఫైల్స్ లాంటి సినిమాలు వచ్చాయి. అయితే అదే తరహాలో రామ్ గోపాల వర్మ వ్యూహం అనే పేరుతో ఓ చిత్రాన్ని రెడీ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల జరిగేలా ప్లాన్ చేసుకుని వ్యూహం సినిమాని రెడీ చేసి పెట్టుకోగా ఈ సినిమాకి ప్రచారం కూడా బాగానే చేస్తున్నాడు. అంత సజావుగా సాగిపోతున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి ఓ చిక్కు ముడి పడింది. డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వాళ్ళ పోస్ట్ పోన్ జరిగి ఇప్పుడు రిలీజ్ అవుతున్న వేల మరొక చిక్కు ముడి ఎదురుపడింది. తెలంగాణ రాష్ట్రం అంతటా థియేటర్లలో, అలాగే మల్టీప్లెక్స్లలో వ్యూహం సినిమా నిలిపివేశారు. రేపు విడుదల అవుతున్న వ్యూహం సినిమా అకస్మాత్తుగా తెలంగాణ అంతటా నిలిపివేసి, టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యాలు డబ్బులు రిఫండ్ చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ కి నష్టం కలిగించేలా తీసిన ఈ సినిమా వాళ్ళ తెలుగు దేశం పార్టీ కి ఎటువంటి నష్టం కలుగకూడదు అని తెలంగాణ రాష్ట్రం లో వ్యూహం సినిమా నిలిపివేసినట్లు మాటలు వినిపిస్తునాయి. అయితే ఈ సినిమా నిలిపివేయడం వెనుక ఎవరు ఉన్నారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా వ్యూహం సినిమా నిలిపివేయడం ఎన్నో చర్చలకు దారి తీస్తుంది.