Krack 10 Days Collections: రూ.25 కోట్ల క్లబ్‌లోకి క్రాక్

Krack 10 Days Collections: మాస్ మహారాజ రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ‘క్రాక్’ సినిమా భారీ వసూళ్లు మూటకట్టుకుంటోంది. జనవరి 9న మార్నింగ్ షో నుంచి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. నిర్మాత ఠాగూర్ మధు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాత్రి షో నుంచి సినిమా ప్రారంభమైంది. పోలీస్ పాత్రలో రవితేజ నటన, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రవితేజ గత రెండు సినిమాలు ప్లాప్ అవ్వగా.. ఈ సినిమా హిట్ కావడంతో రవితేజ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

KRACK 10 DAYS COLLECTIONS

ఇక KRACK సినిమా కలెక్షన్లు చూస్తే.. తొలి 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ని దాటేసి లాభలను సాధించగా.. 10 రోజుల్లోనే రూ.25 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. తొలిరోజు రూ.6.27 కోట్లు, రెండో రోజు రూ.3.08 కోట్లు, మూడోరోజు రూ.2.85 కోట్లు, నాలుగో రోజు రూ.2.65 కోట్లు, ఐదోరోజు రూ.2.16 కోట్లు, ఆరవ రోజు రూ.2.20 కోట్లు, ఏడో రోజు రూ.1.72 కోట్లు, 8వ రోజు రూ.2.18 కోట్లు, 9వ రోజు రూ.1.5 కోట్లు సాధించింది. ఇక 10 రోజు రూ.1.20 కోట్ల కలెక్షన్లు సాధించగా.. 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో KRACK మొత్తం రూ.25.81 కోట్ల షేర్ సాధించింది.