అయ్యో రామా’ అంటున్న రష్మీక

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సినిమా కెరీర్‌లో దూసుకెళ్తుంది రష్మీక మందన్నా. అనతికాలంలోనే వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసి బిజీబిజీగా గడుపుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రిన్స్ మహేశ్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో రోమాన్స్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ -బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తోంది.

అయితే తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రష్మిక పెట్టిన వైరల్‌గా మారింది. వైట్ డ్రెస్‌లో దిగిన ఫోటోను షేర్ చేసిన రష్మిక… ‘అయ్యో రామా’ అని కామెంట్ చేసింది. ఈ ఫొటోలో రష్మిక క్యూట్‌గా తలపై చేయి పెట్టుకుని ఉంది. ఈ ఫొటోను చూసిన ఫాన్స్ ‘ఏం అయింది రష్మీక’ అని కామెంట్ చేస్తున్నారు.

కాగా రష్మీక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. వీలు చిక్కినప్పుడల్లా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫొటోలు, తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.