విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై మ‌న‌స్సు పారేసుకున్న ర‌ష్మిక!

క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగ‌ర్‌. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్ సోమ‌వారం ఉద‌యం 10గంట‌లకు రిలీజ్ చేశారు. ఈ తాజా పోస్ట‌ర్‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం టాప్ ట్రెండింగ్‌లో న‌డుస్తోంది.. మ‌రోవైపు ఈ పోస్ట‌ర్‌తో రౌడీ ఫ్యాన్స్ కూడా సంతోష ప‌డుతున్నారు.

vijay devarakonda

కాగా తాజాగా ఈ పోస్ట‌ర్‌పై హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా ట్వీట్ చేసింది. చాలా గ‌ర్వంగా ఉంది.. కిల్ల‌ర్ పోస్ట‌ర్‌.. ఈ మాస్ట‌ర్ పీస్‌ని తెర‌పై చూడాల‌ని చాలా ఆస‌క్తిగా ఉన్నా.. థియేట‌ర్ల‌లో ఈ సినిమా చూస్తూ.. విజిల్స్ వేస్తూ డ్యాన్స్ వేస్తా.. నా స్వీట్ బీస్ట్‌ల‌కు ఆల్ ది బెస్ట్‌.. అంటూ రష్మిక కామెంట్‌ను పోస్ట్ చేసింది. ఇక ర‌ష్మిక కామెంట్‌పై విజ‌య్ స్పందించ‌గా.. రుషీ.. నీతో పాటు చాలా మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో ఎంతో ఎంజాయ్ చేస్తార‌ని ప్రామిస్ చేస్తున్నా.. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కొత్త స్ట‌ఫ్‌ని చూశావు క‌దా అని కామెంట్‌ను విజ‌య్ పోస్ట్ చేశాడు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతో బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. పూరీ క‌నెక్ట్స్‌, బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ర‌ష్మిక మంద‌న్నా.. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌టిస్తున్న మిష‌న్ మ‌జ్ను చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌గా గీత గోవిందం, నోటా చిత్రాల్లో క‌లిసి న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.‌‌