రష్మిక నితిన్ లని కలుపుతున్న ఫ్లాప్ డైరెక్టర్

సౌత్ స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న… ఛలో మూవీతో డెబ్యు ఇచ్చిన ఈ నేషనల్ క్రష్ ఏ సినిమాలో నటించిన అది బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. అందుకే ఆమె లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్న రష్మిక, తాజాగా తమిళ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. హిందీ డెబ్యుకి కూడా రెడీ అవుతున్న రష్మిక, పుష్ప తర్వాత తెలుగులో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. భీష్మతో తనకి మంచి హిట్ ఇచ్చిన నితిన్ తో మరోసారి నటించడానికి రష్మిక ఓకే చెప్పిందట.

ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న నితిన్, త్వరలో డైరెక్టర్ వక్కంతం వంశీతో ఒక సినిమా చేయబోతున్నాడు. రైటర్ గా మంచి పేరు తెచ్చుకోని ఎన్నో హిట్స్ ఇచ్చిన వంశీ, దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో వంశీకి మరో సినిమా ఛాన్స్ రావడానికి టైం పట్టింది. దాదాపు రెండేళ్ళు టైం తీసుకోని మంచి కథని సిద్దం చేసుకున్న వంశీ, నితిన్ ని లైన్ లో పెట్టాడు. ఇందులో రష్మిక మందన్న ను హీరోయిన్ గా తీసుకోవాలని ఆయన భావిస్తున్నాడట. రష్మిక కూడా నితిన్ తో యాక్ట్ చేయడానికి ఇంటరెస్ట్ చూపించే ఛాన్స్ ఉంది. దీంతో త్వరలోనే భీష్మ కాంబినేషన్ ని తెరపై మరోసారి చూసే అవకాశం ఉంది.