రష్మిక క్రేజ్ కి చెక్ పెడుతున్న స్టార్ హీరోయిన్… కారణం అదేనా?

రష్మిక మందన్న, ప్రస్తుతం టాలీవుడ్ లో సాలిడ్ గా వినిపిస్తున్న పేరు. ఛలో సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు తెరకెక్కుతున్న చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకూ యంగ్ హీరోస్ తో మాత్రమే నటించిన రష్మిక, ఇప్పుడు మహేశ్ బాబు సినిమాలో నటిస్తోంది. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక, ఈ మూవీతో స్టార్ స్టేటస్ అందుకోవడం ఖాయం. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ సినిమా నుంచి రష్మిక లుక్ కూడా రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన స్థాయిలో కాంప్లిమెంట్స్ అందుకోలేకపోయింది.

రష్మిక ఫస్ట్ లుక్ కి ఆ రేంజ్ పబ్లిసిటీ రాకపోవడానికి కారణం, అదే సమయంలో విజయశాంతి లుక్ బయటకి రావడమే. 13 ఏళ్ల తర్వాత లేదు సూపర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వడం, అది కూడా సూపర్ స్టార్ సినిమాలో కావడంతో విజయశాంతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో విజయశాంతి అనే ట్యాగ్ హల్చల్ చేసింది అంటే, ఆమె కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. లేడీ అమితాబ్ ఫాలోయింగ్ ముందు రష్మిక మందన్న క్రేజ్ కనిపించకుండా పోయింది.