ఈషా రెబ్బ కెరీర్ టర్నింగ్ అవకాశం పట్టేసిందా?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో త్వరలో మొదలుకానున్న సినిమా #Chiru152. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల చుట్టూ తిరుగే కథతో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథ విషయం కాసేపు పక్కన పెడితే, చిరు సినిమాలో హీరోయిన్ గా ఈషా రెబ్బ నటించే అవకాశం ఉందని సమాచారం. #Chiru152 సినిమాలో ఇద్దరు హీరోయిన్లకి ఛాన్స్ ఉండడంతో, కొరటాల సెకండ్ హీరోయిన్ పాత్రలో తెలుగమ్మాయిని సెలెక్ట్ చేశాడట. కొరటాల కథలో వృధా పాత్రలు, అవసరం లేని క్యారెక్టర్ లు ఉండవు… కథకి అవసరం అయ్యేవి, కథని ముందుకి నడిపించే పాత్రలే ఉంటాయి, తెరపై కనిపించే ప్రతి పాత్ర కథలో భాగమై సాగుతుంది. అలాంటి డైరెక్టర్ అండ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి చేస్తున్న సినిమాలో ఈషా రెబ్బ నటించడం నిజంగా గొప్ప విషయమే. ఈ మూవీతో ఆమె కెరీర్ టర్న్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

eesha rebba

సెకండ్ హీరోయిన్ గా ఈషా రెబ్బని ఫైనల్ చేసిన కొరటాల శివ, ఫస్ట్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని అనే విషయంలో ఆలోచనలో ఉన్నాడట. అనుష్క, నయనతార, త్రిషా పేర్లు ఈ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. నయనతార అండ్ త్రిషా ఇప్పటికే చిరు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించారు, అనుష్క మాత్రమే క్యామియో రోల్స్ చేసింది. మెగాస్టార్ అండ్ లేడీ సూపర్ స్టార్ కలిస్తే బాగుంటుందని మెగా అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి కొరటాల మదిలో ఏముంది, ఆయన ఎవరిని ఫైనల్ చేస్తాడు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.