పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ లో భారీ సినిమా రాబోతోందా?

పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు అనే వార్త బయటకి రాగానే మెగా అభిమానులంతా ఫుల్ ఖుషి అయ్యారు. అయితే ఈ విషయంలో తనకే ఇంకా క్లారిటీ లేదంటూ పవన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి నిర్మించనున్న ఈ సినిమా తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథ కూడా సిద్దమవుతున్న సమయంలో, పవన్ మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ‘రాజకీయాల్లో ఉన్న వాళ్లు వ్యాపారాలు చేసుకోకూడదా? తాను ఇకపై నిర్మాతగా సినిమాలు చేస్తా’నని చెప్పాడు.

pawan kalyan trivikram ram charan

పవన్ నిర్మాతగా ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగ సినిమాలు వచ్చాయి. ఈ రెండు చిత్రకు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాబట్టలేకపోయాయి. దీంతో పవన్ కళ్యాణ్ మరో సినిమాని ప్రొడ్యూస్ చేయలేదు. గత కొంతకాలంగా పవన్ బ్యానర్ లో రామ్ చరణ్ నటిస్తాడు, దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జరిగితే పవన్ కళ్యాణ్ క్రియేట్ వర్క్స్ బ్యానర్ లో భారీ సినిమా పడినట్లే. అయితే నిర్మాతగా కంటిన్యూ అవుతాను అని క్లియర్ గా చెప్పేసిన పవన్ కళ్యాణ్, పింక్ రీమేక్ పై డౌట్స్ రైజ్ చేశాడు? మరి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యేలోపు దిల్ రాజు అండ్ బ్యాచ్ పవన్ ని ఒప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది చూడాలి.