దేశ చరిత్రని మార్చేసిన కథతో ‘పానిపట్’, ఇది బాలీవుడ్ బాహుబలి

కోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీని పూర్తిగా మార్చేసిన యుద్ధం పానిపట్ వార్. పానిపట్ వార్ 1, 2,3 పేరుతో జరిగిన ఈ యుద్ధాల్లో మరాఠా, మొఘల్ సామ్రాజ్యాలు పోరాడాయి. ముఖ్యంగా పానిపట్ 3 వార్ మన హిస్టరీని చేంజ్ చేసే స్థాయిలో ఇంపాక్ట్ చేసింది. సదాశివ్ రావు, అహ్మద్ షా అబ్దాలీ మధ్య జరిగిన ఈ యుద్ధంలో రక్తం ఎరుపై పారింది అని చరిత్ర చెప్తున్న నిజం. ఈ యుద్ధాన్నే కథాంశంగా చేసుకోని లగాన్, జోధా అక్బర్ లాంటి సినిమాలని తెరకెక్కించిన అశుతోష్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ పానిపట్. సదాశివ్ రావుగా అర్జున్ కపూర్ నటించగా, సంజయ్ దత్ అబ్దాలీగా నటించాడు. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సునితా గోవారికర్, రోహిత్‌ షీలత్కర్‌ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, వార్ సీన్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ కంటెంట్ అన్నీ కలిసిన ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేసింది. అర్జున్ కపూర్, బాజీరావు మస్తానీ సినిమాలోని రణ్వీర్ సింగ్ ని గుర్తు చేసినా కూడా తన పాత్రకి సెట్ అయ్యాడు. వారియర్ లుక్ లో చాలా బాగున్నాడు. అబ్దాలీగా కనిపించిన సంజయ్ దత్, తన ప్రెజెన్స్ తోనే ఇతను విలన్ అనే ఫీలింగ్ కలిగించాడు. సంజయ్, అర్జున్ చెప్పిన డైలాగ్స్… అజయ్ అతుల్ ఇచ్చిన సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్, మురళీధరన్ కెమెరా వర్క్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి పానిపట్ ట్రైలర్ ని విజువల్ వండర్ లా అనిపించేలా చేశాయి. ఇక సదాశివ్అ రావు భార్య పార్వతీ బాయ్‌ పాత్రలో కృతీ సనన్‌, హుందాగా కనిపించింది. వార్ సీన్స్ లో కత్తి తిప్పిన ఈ బ్యూటీ, ఈ మూవీతో మరో దీపికా అవుతుందేమో చూడాలి. సింపుల్ గా చెప్పాలి అంటే బాలీవుడ్ బాహుబలిలా కనిపిస్తున్న ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద మైనస్, డైరెక్టర్ అశుతోష్ గోవరికర్.

అద్భుతంగా తెరకెక్కించే అశుతోష్, సినిమా నిడివి మాత్రం తగ్గించలేదు. లెంగ్తి సినిమాలకి కెరాఫ్ అడ్రస్ అయిన అశుతోష్… ఇప్పుడు పానిపట్ ని కూడా మూడున్నర గంటల నిడివితో తెరకెక్కించాడట. సినిమా ఎంత బాగున్నా కూడా, ఫాస్ట్ ఫేజ్ మూవీస్ ఇష్టపడే ఈ జనరేషన్ ఆడియన్స్ అంత లెంగ్త్ ఉన్న మూవీని ఎంత వరకూ ఆదరిస్తారు అనేది ఆలోచించాల్సిన విషయమే. గతంలో అశుతోష్ డైరెక్ట్ చేసిన జోధా అక్బర్, మొహంజొదారో సినిమాలు బాగున్నా కూడా ప్రేక్షకులని మెప్పించి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే స్థాయిలో ఆడకపోవడానికి కారణం అదే. మరి ఈసారి అయినా అశుతోష్ రిలీజ్ కి ముందు ఒకసారి సినిమా చూసి, కత్తెరకి పని చెప్తాడేమో చూడాలి.