Virataparvam: మెగాస్టార్ రిలీజ్ చేయ‌నున్న రానా సినిమా టీజ‌ర్‌..

Virataparvam: రానా ద‌గ్గుబాటి న‌టించిన తాజా చిత్రం విరాట ప‌ర్వం. ఈ చిత్రంలో రానా స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై నిర్మాత సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల్‌, సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి. ఈ చిత్రం కోసం ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు రానా ఫ్యాన్స్‌. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈVirataparvam సినిమాకు సంబంధించి స‌రికొత్త అప్‌డేట్ ను ప్ర‌క‌టించారు.

Rana New Movie

విరాట ప‌ర్వం టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెరైటీగా ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఇందుమూలంగా ప్రేక్ష‌కుల‌కు తెలియజేయుదేమ‌న‌గా.. విరాట ప‌ర్వం టీజ‌ర్‌ను మార్చి 18న సాయంత్రం 5.04నిమిషాల‌కు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల కానుంద‌ని దండోరా చేసిన వీడియో ద్వారా ప్ర‌క‌టించారు చిత్రబృందం. ఇక ఈ చిత్రం య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా నాటి విప్ల‌వ క‌థ‌గా తెర‌కెక్కుతున్న ఈVirataparvam చిత్రంలో.. ప్రియ‌మ‌ణి లేడీ న‌క్స‌లైట్‌గా భార‌త‌క్క పాత్ర‌లో న‌టిస్తుంది.