Chennai: సాయిప‌ల్ల‌వికి పోటీగా త‌న సోద‌రి..

Chennai: ప్ర‌ముఖ క‌థానాయిక సాయిప‌ల్ల‌వి న్యాచుర‌ల్ న‌టిగా ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. త‌న డ్యాన్స్ ప్ర‌తిభ‌తో సినిమాలో రాణిస్తూ.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. త‌న అందంతో పాటు హావాభావాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక సాయిప‌ల్ల‌వి న్యాచుర‌ల్ అందంతో రెచ్చిపోతుంటే.. అంతే ధీటుగా సాయిప‌ల్ల‌వి సోద‌రి పూజా క‌న్న‌న్ కూడా సోష‌ల్ మీడియాలో హల్చ‌ల్ చేస్తోంది.

saipallavi sister

పూజా అందం, అభిన‌యానికి ఫిదా అయిన ప్ర‌ముఖ స్టంట్ మాస్ట‌ర్ శివ‌.. తాను మొద‌టి సారి ద‌ర్శ‌క‌త్వం చేయ‌నున్న చిత్రంలో ఆమెకు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు వార్తాలు వెలువ‌డుతున్నాయి. దీంతో ఈ వార్తా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారి.. త‌న అక్క సాయిపల్ల‌వికి పూజా క‌న్న‌న్ క‌చ్చితంగా పోటీనిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.