ఏమయ్యింది రానా… ఇలా అయ్యావ్

రానా దగ్గుబాటి.. బాహుబలి సినిమాలో భల్లాల దేవుడిగా అతడి నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. నేషనల్ వైడ్ ఫేమ్ ఉన్న రానా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రానా నటించిన హౌజ్ ఫుల్ 4 సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే అన్ని భాషల్లో నటిస్తున్న రానా తెలుగులో మాత్రం ఫాస్ట్ గా సినిమాలు చెయ్యట్లేదు. ఇప్పటికే హాథీ మేరీ సాథీ సినిమాని తెలుగు హిందీ భాషల్లో చేస్తున్న రానా, రీసెంట్ గా వేణు ఉడుగులతో విరాటపర్వం మొదలు పెట్టాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కాస్త బాలన్స్ ఉంది. రానా మాత్రమే బాకీ ఉన్నాయి, త్వరలో షూట్ మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రానాకి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో రానా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఎందుకు అంత సన్నగా అయిపోయాడు రానా అని అనుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు.