అతిలోక సుందరి కూతురు శృతి తప్పుతోందా?

అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ, అప్పుడప్పుడూ కట్టుబొట్టుతో అమ్మ శ్రీదేవిని గుర్తు చేస్తోంది. ప్రస్తుతం గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తున్న జాన్వీ, కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా తాక్త్ లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే జాన్వీ, తాజాగా చేసిన ఫోటో షూట్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఉంది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేసిన ఫోటో షూట్ నుంచి రెండు ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో జాన్వీ పోస్ట్ చేసింది.

క్లీవేజ్ షోతో పాటు థైస్ కనబడేలా ఇచ్చిన ఫోజు యూత్ మతిపోయేలా చేస్తోంది. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూసిన వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఖుషి అవుతున్నారు. కొందరు మాత్రం శ్రీదేవి కూతురు మరీ అడ్డు అదుపు లేకుండా స్కిన్ షో చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే జాన్వీ ఉన్నది గ్లామర్ ఫీల్డ్ లో, ఎక్కువ రోజులు హీరోయిన్ గా సస్టైన్ అవ్వాలి అంటే యాక్టింగ్ తో పాటు గ్లామర్ ని ఎక్కడ ఎంత చూపించాలో కూడా తెలిసి ఉండాలి అప్పుడే మార్కెట్ లో ఉంటారు. ఈ విషయం క్లియర్ గా తెలుసు కాబట్టే అతిలోక సుందరి కూతురు అతిగా కాకుండా మితంగానే గ్లామర్ షో చేస్తోంది.