Tollywood: పెళ్లి కాక‌ముందు చెర్రీ-ఉపాస‌న ఎలా ఎంజాయ్ చేశారో చూడండి..

Tollywood: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్- ఉపాస‌న జంట సినీ ఇండ‌స్ట్రీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో కూడా మంచి దంపతులుగా గుర్తింపు ఉంది. వీరిని ఆద‌ర్శంగా తీసుకుని ఎంతో మంది దంప‌తులు ఆనందంగా జీవిస్తారు. రాంచ‌ర‌ణ్ హీరో అయితే ఉపాస‌న అపోలో ఆస్ప‌త్రికి సంబంధించిన హెల్త్ మ్యాగ‌జైన్ నిర్వాహ‌కురాలిగా ప‌లు సేవ‌కార్యక్రమాల‌ను చేప‌డుతుంది. కాగా తాజాగా ఉపాస‌న మెగా అభిమానుల‌ను ఫిదా చేసే ఫోటోను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది..

Cherry-upasana

ఆ ఫోటోకు హ్యాపీ పీపుల్‌.. త‌మ జీవితాల్లోని సంతోషానికి ఎవ‌రైనా ఆక‌ర్షితులే.. నేనూ దీనిని పూర్తిగా న‌మ్ముతాను. త్రోబ్యాక్ మెమోరీ అంటూ క్యాప్ష‌న్ పెట్టింది. ఈ ఫోటో వీరిద్ద‌రికి పెళ్లి కాక‌ముందు దిగింది.. రొమాంటిక్ ఫో‌జులో అలా ఓ ఖ‌రీదైన వింటేజ్ బైక్ వ‌ద్ద నిలుచుని క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి.. మెగా అభిమానుల‌ను ఫిదా చేస్తుంది. ‌